Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వధువు లేకుండానే పెళ్లి... నిజం తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

వధువు లేకుండానే పెళ్లి... నిజం తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!
, మంగళవారం, 14 మే 2019 (10:23 IST)
తమ ఇంట అంగరంగ వైభవంగా జరిగిన అన్న పెళ్లిని కళ్ళారా చూశాడు. ఇలాగే తాను కూడా పెళ్లి చేసుకోవాలని భావించాడు. అంతే... తండ్రిని అడిగాడు. నాన్నా నాకూ పెళ్లి చేయవా అంటూ ప్రాధేయపడ్డాడు. నీకు పెళ్లి వద్దు బిడ్డా అంటూ నాన్న ఎంతో ప్రాధేయపడుతూ చెప్పాడు. కానీ ఆ బిడ్డ పట్టువీడలేదు. దీంతో కన్నబిడ్డ కోర్కె తీర్చేందుకు ఆ తండ్రి నిర్ణయించి, వధువు లేకుండానే ఆ ఇంట్లో మరోమారు ఘనంగా శుభకార్యం చేయించాడు. అయితే, ఈ వివాహం వెనుక అసలు నిజం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కళ్లు చెమర్చుతాయి. ఆ నిజమేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
గుజరాత్ రాష్ట్రంలోని హిమయత్ నగర్‌కు చెందిన అజయ్ బరోట్. 27 యేళ్ల మానసిక రోగి. వయసు పెరిగినా అతనిలో మానసికపరిపక్వత అనేది లేది. అందుకే ఇప్పటికీ చిన్నపిల్లాడిలాగే ఉంటున్నారు. పైగా, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఆ తర్వాత అతని ఆలనాపాలనా అంతా తండ్రి విష్ణు బరోట్ చూసుకుంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో అజయ్ బరోట్ అన్న పెళ్లి జరిగింది. దీన్ని చూసిన అజయ్.. తాను కూడా అదేవిధంగా పెళ్ళి చేసుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన తండ్రికి విషయం చెప్పాడు. బిడ్డ మానసికస్థితి దృష్ట్యా అది వీలుపడదని చెప్పాడు. అయినప్పటికీ అజయ్ ఏ మాత్రం పట్టువీడలేదు. అతనికి పిల్లనిచ్చేందుకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. 
 
అయితే, అమాయక చక్రవర్తి కొడుకు కోరిక కాదనలేక.. తండ్రి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. అది పెళ్లి కూతురు లేకుండానే. అది తెలిసిన ఊరి జనం వ్యతిరేకించారు. పెళ్లి కూతురు లేకుండా పెళ్లేంటీ అన్నారు. అయినప్పటికీ కొడుకు కోసం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కుమారుడి కోరికను ఎలాగైన తీర్చాలని అంగరంగ వైభవంగా పెళ్లివేడుక జరిపించాడు. పెళ్లి వేడుకలో దాదాపు 800 మంది కోసం విందు ఏర్పాటు చేయించాడు. పెళ్లి వేడుకల్లో మ్యూజిక్, డ్యాన్స్ చేస్తుంటే.. అది చూసి పెళ్లికొడుకు అజయ్ ఎంతో సంతోషించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ ఎమ్మెల్యేలు... ఎక్కడ?