Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త చిక్కులో టిటిడి నూతన ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. కానీ?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (19:45 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డిని టిటిడి ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఎపి సిఎం ప్రకటించారు. పాత బోర్డు ఉన్న నేపథ్యంలో ఆ బోర్డును రద్దు చేయడానికి కాస్త సమయం పట్టింది. కానీ అనుకోని రీతిలో అనూహ్యంగా సుబ్బారెడ్డికి టిటిడి ఛైర్మన్ పదవి లభించింది. 
 
తిరుమలకు చేరుకున్న వై.వి.సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో టిటిడి ఛైర్మన్ చేత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వై.వి.సుబ్బారెడ్డికి ఎప్పటివరకు ఆ పదవిలో ఉండనిస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. గతంలో అయితే కేవలం సంవత్సరం పాటు ఆ పదవిలో ఛైర్మన్‌ను నియమించేవారు.
 
ఆ తరువాత ఛైర్మన్, సభ్యులు బాగా పనిచేస్తే మరో సంవత్సరం పొడిగించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉందా అన్నది అనుమానంగా మారుతోంది. రెండున్నర సంవత్సరాల పాటు నామినేటెడ్ పదవుల్లో అలాగే ఉండనిస్తానని, అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం వెంటనే ఆ పదవి నుంచి తొలగిస్తానని జగన్ చెప్పారు.
 
దీంతో వై.వి.సుబ్బారెడ్డిని రెండున్నరేళ్ళ పాటు టిటిడి ఛైర్మన్‌గా కొనసాగిస్తారా లేకుంటే ఒక సంవత్సరం పాటు కొనసాగించి కొత్త వ్యక్తి మళ్ళీ టిటిడి ఛైర్మన్‌గా చేస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు వై.వి.సుబ్బా రెడ్డి క్రిస్టియన్ అంటూ ప్రచారం ప్రారంభించారు. సామాజిక మాధ్యమాలే వేదికగా ఈ ప్రచారం జరుగుతోంది. దీంతో వై.వి.సుబ్బా రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఐతే ఇప్పటికే తను హిందువునన్న విషయాన్ని తన ఇంట్లో ఏ గోడను అడిగినా చెబుతుందని స్పష్టీకరించారి వైవీ. నమో వేంకటేశాయ.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments