Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పవర్: వెనక్కి తగ్గిన తితిదే ఛైర్మన్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (16:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ ఎలాంటి ఆలోచన లేకుండా చివరకు ఆ నిర్ణయంపై విమర్సలు వెల్లువెత్తితే వెనక్కి తగ్గడం చేస్తున్నారు. 

 
మరోసారి అలాంటి వివాదాల్లోకి వెళ్ళారు వై.వి.సుబ్బారెడ్డి. తిరుమలలో టిటిడి మాత్రమే భోజనం పెడుతుందని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పాత అన్నదాన భవనంలో అల్పాహారాన్ని అందిస్తామన్నారు. దాంతో పాటు ఏ రాష్ట్రం నుంచి వస్తే ఆ రాష్ట్రంలో వారు తినే భోజనాన్ని బట్టి అన్నింటిని అందిస్తామన్నారు. తిరుమలలో ప్రైవేటు హోటల్స్ లేకుండా టిటిడినే భక్తులందరికీ ఎంతో రుచికరమైన భోజనం ఇస్తుందన్నారు.

 
దీంతో ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు నోటీసులు ఇచ్చేశారు. ఇక మిగిలింది తిరుపతికి దింపేయడమేనని అందరూ భావించారు. ఆ ప్రాసెస్ అలా జరుగుతుండగానే మరోసారి టిటిడి ఛైర్మన్ సామాన్య భక్తులతో ఆడుకునే విధంగా మాట్లాడారు.

 
తిరుమలలోని 130 ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్స్, 30కి పైగా హోటళ్లను అలాగే ఉంచుతాం.. అయితే భక్తులకు చపాతీ, రోటీలను కూడా పెడతామన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో ప్రైవేటు హోటల్స్ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాయని.. అధిక ధరలను వసూలు చేస్తున్నాయని ఫిర్యాదు వెళితేనే ఈ నిర్ణయం తీసుకున్న ఛైర్మన్ చివరకు రాజకీయ ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

 
రాజకీయ నాయకుల నుంచి ఎక్కువ ఒత్తిడి రావడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నారు టిటిడి ఛైర్మన్. దీన్నిబట్టి తిరుమలలో ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ అలాగే కొనసాగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

ఒక పథకం ప్రకారం సాయిరాం శంకర్ చేసింది ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments