Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20 లక్షలతో మహిళా విశ్వవిద్యాలయంలో శ్రీవారి ఆలయం: టిటిడి ఛైర్మన్

20 లక్షలతో మహిళా విశ్వవిద్యాలయంలో శ్రీవారి ఆలయం: టిటిడి ఛైర్మన్
, శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:37 IST)
తిరుపతిలో మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యిందంటే అది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దయేనన్నారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన కెల్ రావు భవనాన్ని, ఆడిటోరియం, లైవ్లీ హుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్, మెడిసినల్ ప్లాంట్ పార్కులను టిటిడి ఛైర్మన్ ప్రారంభించారు. 

 
ఈ సంధర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, మహిళా విశ్వవిద్యాలయం అభివృద్థికి టిటిడి ఇతోధిక సహాయం అందిస్తోందన్నారు. ఇప్పటికే మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణానికి టిటిడి 130 ఎకరాల భూమిని ఇచ్చిందని చెప్పారు. దీంతో పాటు ఏటా కోటి రూపాయల గ్రాంట్‌ను కూడా అందిస్తోందన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మిస్తున్నామని.. త్వరలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు టిటిడి ఛైర్మన్.

 
సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీ లేకుండా సమాజం లేదన్నారు. సంపూర్ణ ప్రేమ తత్వంలో ఆమె శక్తిగా అవతరించిందన్నారు. అలాంటి స్త్రీ మూర్తులందరికీ సంపూర్ణంగా నిండుగా విద్యను అందిస్తూ సమాజ ఉన్నతికి తోడ్పడుతోంది పద్మావతి మహిళా విశ్వవిద్యాలయమన్నారు. ఎంతోమంది విద్యార్థినులను ఉన్నత చదువులను చదివించిన ఘనత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానిదేనన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం తలుపులు - 14న మకర జ్యోతి