Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల జిల్లా కొరిశపాడులో విమానాల ల్యాండిగ్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (19:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. ఏదేని విపత్తులు సంభవించినపుడు, యుద్ధ సమయాల్లో అత్యవసర రవాణా కోసం దేశంలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రన్‌వేలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై అత్యవసర ల్యాండింగ్ కోసం రన్‌వేలు నిర్మించారు. 
 
వీటిపై నేడు అధికారులు కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో సుఖోయ్ 30, హాక్ యుద్ధ విమానాలు, ఏఎన్ 32 రవాణా విమానం, రెండు హెలికాఫ్టర్ పాల్గొన్నాయి. వాయుసేన విమానాలు రన్‌వేపై ఐదు మీటర్ల ఎత్తు వరకు వచ్చి మళ్లీ గాల్లోకి లేచాయి. ఇలా పలుమార్లు విన్యాసాలు చేపట్టారు. 
 
యుద్ధ విమానాలు రొదతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఎపుడూ చూడని యుద్ధ విమానాలు తమ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడం పట్ల కొరిశపాడు, సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments