శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు|| నవమి రా.2.28 ఆరుద్ర రా.9.51 ఉ.శే.వ. 7.30కు
ప.దు. 12.35 ల 1.22 పు.దు. 2.55 ల 3.42.
మేషం :- ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం మిమ్ములను ఇరకాటానికి గురిచేస్తుంది. ముఖ్యుల రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. పంతాలకు పోకుండా లౌక్యంగా మీ పనులు చక్కపెట్టుకోవలసి ఉంటుంది. వృత్తి పరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు.
వృషభం :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పత్రికా సంస్థలలోనివారు ఒక ప్రకటనపట్ల ఆకర్షితులవుతారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. శారీరకశ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు.
మిథునం :- సంఘంలోనూ, కుటుంబంలోనూ మీ మాటకు అదరణ లభిస్తుంది. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
కర్కాటకం :- భాగస్వామిక వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది.
సింహం :- స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికం. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది.
కన్య :- వ్యాపారాల్లో పోటీని తట్టుకోవటంతో పాటు క్రమంగా స్థిరపడతారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరికి నెరవేరుతుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం.
తుల :- స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా మీ పనులు సానుకూలమవుతాయి.
వృశ్చికం :- ముఖ్యులతో సంప్రదింపులు, వ్యాపార లావాదేవీలకు అనుకూలం. స్త్రీల ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికం. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తిరకంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
ధనస్సు :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగల్గుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
మకరం :- రియల్ ఎస్టేట్ వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు.
కుంభం :- కుటుంబ విషయాలపట్ల శ్రద్ద వహించండి. స్వయంకృషితో రాబడికి మించి ఖర్చులుంటాయి. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
మీనం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. స్త్రీలు దైవ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కుంటారు.