Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-03-2024 శుక్రవారం దినఫలాలు - ఆస్తి వ్యవహారంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు...

Advertiesment
astrolgy

రామన్

, శుక్రవారం, 15 మార్చి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ షష్ఠి తె.3.43 కృత్తిక రా.9.30 ఉ.వ.9.52 ల 11.25. ఉ. దు. 8.42 ల 9.29 ప. దు. 8. 42 ల 9.29 ప.దు. 12.35ల 1.22.
 
మేషం :- వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. ఆస్తి వ్యవహారంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉండవు. కొబ్బరి, చల్లనిపానీయ, చిరువ్యాపారులకు కలసివస్తుంది. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు పలు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మిథునం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
కర్కాటకం :- స్థిరాస్తి అమ్మటానికి చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారాలకు లాభదాయకం. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా బలపడతాయి. కుటుంబీకుల సంతోషం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. 
 
సింహం :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేకపోవడటం వల్ల ఆందోళనకు గురవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. విందులలోపరిమితి పాటించండి.
 
కన్య :- ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. షాపు గుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. బంధువులు మీ నుంచి ధన సహాయం అర్థిస్తారు.
 
తుల :- ప్రైవేటు సంస్థల్లో వారికి విశ్రాంతి లోపం, చికాకు, అలసట వంటివి ఎదుర్కొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల్లో వారికి పనిభారం అధికంకాగలదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. విద్యార్థునులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ఋణం తీర్చటానికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ పెద్దల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భల్లో మాత్రం చేయాల్సిన పనులు ఆకస్మాత్తుగా వాయిదా పడతాయి.
 
ధనస్సు :- సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కోసారి మీ కుమారుని మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మకరం :- పొట్ట, నరాలు, కాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రతి, పొగాకు, చెరుకు రైతులకు అనుకోని అభివృద్ధి కానరాగలదు. ధనం ఎవరికైనా ఇచ్చినట్లయితే వసూలు అవ్వడం కష్టమని గమనించగలరు. పత్రికా రంగాలలోని వారికి, మీడియా రంగాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తగలవు.
 
కుంభం :- ఆదాయ వ్యాయాలు సమానంగా ఉంటాయి. వ్యాపారంలో నష్టలను కొంత మేరకుఅధికమిస్తారు. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దంపతులు మధ్య కలహాలు అధికమవుతాయి. విద్యార్థులకు మతిమరుపు పెరగటం వల్ల ఆందోళన అధికమవుతుంది.
 
మీనం :- కాంట్రాక్టర్లకురావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. అంతరిక్ష పరిశోధకులకు, సైంటిస్టులకు, భూగర్భ పరిశోధకులకు అనుకోని అభివృద్ధి కానవస్తుంది. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్ర, శనివారాల్లో పిండి దీపాన్ని వెలిగిస్తే.. ఏంటి లాభం?