Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట వినని ఉన్నతాధికారులపై ఈసీ కొరఢా...

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (17:22 IST)
దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, ఎన్నికల నిబంధనల మేరకు నడుచుకోని అధికారులపై ఆయా కేంద్ర ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తుంది. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన హోం శాఖ కార్యదర్శులపై వేటు వేసింది. అలాగే, బీహార్, జార్కండ్ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను విధుల నుంచి తప్పించాలని ఆదేశించింది. ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్ పోలీస బాస్ అయిన డీజీపీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 
 
లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం ఈమేరకు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌తోపాటు అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లపైనా వేటుపడింది. మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌ల సాధారణ పరిపాలనా విభాగాల కార్యదర్శులను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ఎస్.బి.ఐకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ 
 
ఎన్నికల బాండ్ల అంశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. వివరాలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. క్రమ సంఖ్యతో సహా చెప్పాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ వివరాలన్నింటితో గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. బ్యాంకు నుంచి వివాలన్నీ అందినవెంటనే వాటిని వెబ్‌సైట్‌‍లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. 
 
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్.బి.ఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌‍పై సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు ఆధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోరుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్.బి.ఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌‍లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments