నిమజ్జనంలో విషాదం.. విగ్రహంతో పాటు ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:20 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలి నాగులాపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని సముద్రంలో కలిపే సమయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ గ్రామానికి చెందిన యువకులంతా కలిసి వినియకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇష్టదైవానికి నవరాత్రుల పేరిట వివిధ రకాలైన పూజలు చేశారు. ఆ తర్వాత విగ్రహ నిమజ్జన వేడుకల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. తమ గ్రామంలోని విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేయాలని భావించారు. 
 
విగ్రహాన్ని ఊరేగించుకుంటూ వెళ్లి ఉప్పాడ సమీపంలోని హార్బర్ వద్ద నిమజ్జనం చేశారు. అయితే, ఆ సమంయలో అలల తీవ్ర ఎక్కువగా ఉండటంతో సముద్రంలో నిమజ్జనం చేసిన విగ్రహం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీన్ని గమనించిన కొందరు యువకులు మన విగ్రహం ఒడ్డుకు కొట్టుకొస్తుందని చెప్పారు. వెంటనే వారంతా వెనక్కి వెళ్లి విగ్రహాన్ని సముద్రంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. 
 
ఇంతలో ఓ రాక్షస అలకు విగ్రహంతో ముగ్గురు యువకులు సముద్రంలోకి వెళ్లిపోయారు. వీరి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆచూకీ మాత్రం తెలియడం లేదు. గల్లంతైన యువకులను సతీష్, విజయ్ వర్ధన్‌లుగా గుర్తించారు. వెంకట రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, గల్లైంతైన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments