Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం కియా కంపెనీలో దొంగలుపడ్డారు.. 900 కారు ఇంజిన్లు చోరీ!!

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (14:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ కంపెనీ ఉంది. ఇందులో దొంగలుపడ్డారు. ఈ దొంగలు ఏకంగా 900 ఇంజన్లు చోరీచేసినట్టు సమాచారం. ఇదే అంశంపై కంపెనీ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా కంపెనీలో తయారయ్యే కార్లకు అవసరమైన విడిభాగాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తాయి. ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇవి మార్గమధ్యంలో చోరీకి గురయ్యాయా లేక కంపెనీలోనే దొంగతనం చేశారా అనే అంశంపై స్పష్టత రావాల్సివుంది. 
 
ఈ చోరీకి  సంబంధించిన గత నెల 19వ తేదీన కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా, పోలీసులు అందకు సమ్మతించలేదు. లిఖితపూర్వకంగా ఇస్తేనే విచారణ చేపడుతామని స్పష్టం చేయడంతో ఇక చేసేది లేక వారు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కియా కార్ల తయారీ కంపెనీలో చోరీకి గురైన ఇంజన్లు ఎక్కడున్నాయన్న అంశాన్న నిగ్గు తేల్చేందుకు పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు కూడా పూర్తికాగా, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన తర్వాతే  పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments