Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతమ్మకు తాళికట్టిన వైకాపా ఎమ్మెల్యే.. అడ్డుకోని పండితులు...

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (13:55 IST)
గత ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న వైకాపా నేతలు అధికారానికి దూరమైన వారితీరు మాత్రం మారలేదు. వారు చేస్తున్న పనులతో ప్రజల్లో చులకన కావడంతో పాటు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన పాడుపనికి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 
 
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాళిని తాకి ఇవ్వమని ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు ఇచ్చారు. ఆ తాళిని అందుకున్న ఎమ్మెల్యే... సీతమ్మ మెడలో (విగ్రహం) కట్టేశాడు. తాళి కడుతున్న సమయంలో ఎమ్మెల్యేన పండితులు అడ్డుకోకుండా అక్షింతలు వేయడం గమనార్హం. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో తాను చేసిన తప్పును తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలతో పాటు భక్తులకు క్షమాపణలు చెప్పారు. పైగా, పండితులు కట్టమంటేనే తాను సీతమ్మ మెడలో తాళికట్టానని బుకాయిస్తున్నారు. దేవుళ్లపై తనకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని, గత 15 యేళ్లుగా క్రమం తప్పకుండా అయ్యప్ప మాల వేస్తున్నట్టు సెలవిచ్చారు. అయితే, నెటిజన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఏం చేస్తే ఏమి లాభమని, కనీస జ్ఞానం లేకుండా నడుచుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments