Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగ సుఖం లేకుండా ఎలా ఉంటున్నావ్... ఆ బిజినెస్ చెయ్.. నేను సపోర్టు చేస్తా.. ఓ సీఐ కామెంట్స్

Advertiesment
victim girl

ఠాగూర్

, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (09:49 IST)
ఓ పొలం వివాదంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివాహితను సీఐ అసభ్యంగా నడుచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. భర్తను ఎందుకు వదిలేశావు.. రాత్రిపూట మగసుఖం లేకుండా ఎలా ఉంటున్నావ్... ఆ బిజినెస్ చెయ్ నేను సోర్టు చేస్తానంటూ ఆమెను పలు విధాలుగా వేధించాడు. ఆ సీఐ వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో భరించలేని ఆ మహిళ.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, ఆయన విచారణకు ఆదేశించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం టీడీపల్లి తాండాలో ఇది వెలుగు చూసింది. 
 
ఈ తండాకు చెందిన గాయత్రి అనే మహిళ జిల్లా ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆ మహిళ పట్ల అసభ్యంగా నడుచుకున్న సీఐ రామయ్యపై విచారణ జరిపాలని ఎస్పీ ఆదేశించారు. 
 
బాధితురాలి చేసిన ఫిర్యాదులోని వివరాల మేరకు... టీడీపల్లి తాండాలో తమ ఇంటికి సమీపంలోనే తమ బంధువుల పొలం ఉందని, ఆ పొలం హద్దుల విషయంలో ఇరు కుటుంబ సభ్యులు గొడవపడటంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో ఆ మహిళ కూడా ఠాణాకు వెళ్లి ఇరు కుటుంబాలకు సర్ది చెప్పాలని భావించింది.
 
దీంతో ఆ మహిళను ఒక్కదాన్నే సీఐ రామయ్య తన చాంబర్‌కు పిలిచి అవమానకరంగా మాట్లాడినట్టు పేర్కొంది. అసలు గొడవను పక్కనబెట్టేసి.. రాత్రి 10 గంటల వరకు చాంబర్లోనే ఉంచుకుని వేధించాడని పేర్కొంది. నీ భర్త ఏం చేస్తున్నాడు... ఎలా విడిపోయారు. ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నావు. ఒంటరిగా ఎలా ఉంటున్నావు. రాత్రిపూట మగసుఖం లేకుండా ఎలా గడుపుతున్నావు... బిజినెస్ చెయ్యి నేను నీకు సపోర్టు చేస్తా.. నేను చాలా మంచి ఆఫీసర్‌ను అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ తను భయభ్రాంతులకు గురిచేశాడని పేర్కొంది. 
 
ఈ విషయాన్ని వెంటనే తన స్నేహితుడు రామాంజనేయులుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింద. విచారణ పేరుతో సీఐ తనను ఎలా భయభ్రాంతులకు గురిచేశాడో సీసీకెమెరాల ఆధారంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా ఎస్పీ పూర్తి విచారణకు ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్