Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు రైల్వే డివిజన్‌లో విమానాల్లా రైళ్ల వేగం, ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (09:16 IST)
గుంటూరు రైల్వే డివిజన్‌లో బ్రాంచ్‌ మార్గాలు మినహా అంతటా 120 కిలోమీటర్ల వేగంతో రైళ్ల ప్రయాణానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్య అనుమతి ఇచ్చారు.

ఆయన మాచర్ల నుంచి మంగళగిరి వరకు వార్షిక తనిఖీ చేశారు. రెడ్డిగూడెం, సత్తెనపల్లి సెక్షన్‌ మధ్యన ధూళిపాళ్ల వాగుపై భారీ వంతెన నెం బరు. 48, మలుపు నెంబరు. 11ని పరిశీ లించారు. సత్తెనపల్లి - సిరిపురం, గుం టూరు - మంగళగిరి మధ్యన వేగ పరీక్ష నిర్వహించారు. బండారుపల్లి - నల్ల పాడు మధ్యన ఆర్‌యూబీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
గుంటూరు - కాచిగూడ సమయపట్టిక మార్చాలి
గుంటూరు - కాచీగూడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ సమయపట్టికను మార్పు చే యాలని జడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌కి విజ్ఞప్తి చేశా రు. గుంటూరులో ఆయనను కలిసిన జడ్‌ ఆర్‌యూసీసీ సభ్యుడు ఉప్పు లూరి శశిధర్‌ చౌదరి వినతి పత్రం అందజేశారు.

గుంటూరు వైపు నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరితే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా కూడా నంద్యాల ప్రాంత ప్రయాణికు లకు ఉపయోగపడుతుంద న్నారు. కాచీగూడ వైపు నుంచి వచ్చేట ప్పుడు వేకువజామున 4.15 గంటలకు నంద్యాలకు వచ్చేలే రీ షెడ్యూల్‌ చేయాల న్నారు. రేపల్లె - సికిం ద్రాబాద్‌ డెల్టా ఎక్స్‌ ప్రెస్‌ వేకువజామున 5 గంటలకల్లా సికింద్రాబాద్‌ చేరుకునేలా చూడాలన్నారు.

విజయవాడ - చెన్నై సెంట్రల్‌ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8.30 గంటలకు చెన్నై సెంట్రల్‌కి చేరుకునేలా చూడాలన్నారు. రత్నాచల్‌, ఉదయ్‌  ఎక్స్‌ప్రెస్‌లను గుంటూరు వరకు పొడి గించాలని కోరారు. విశాఖపట్టణం - లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ ఎక్స్‌ప్రెస్‌ని గుంటూరు, నడికుడి మార్గంలో మళ్లించాలన్నారు.

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ని కూడా నంద్యాల మార్గంలో గుంటూరు మీదగా మళ్లింపు చేయాలన్నారు. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ని డైలీ సర్వీసుగా చేయల న్నారు. పూణే - భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరులో నిలుపుదల సౌకర్యం కల్పించాలన్నారు. సర్కారు ఎక్స్‌ప్రెస్‌కి న్యూగుంటూరు స్టేషన్‌లో తొలగించిన నిలుపుదల సౌకర్యాన్ని పునరు ద్ధరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments