Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు ప్రయాణికులకు శుభవార్త, పండుగ సీజన్ నేపధ్యంలో స్పెషల్ ట్రైన్స్

Advertiesment
రైలు ప్రయాణికులకు శుభవార్త, పండుగ సీజన్ నేపధ్యంలో స్పెషల్ ట్రైన్స్
, గురువారం, 7 జనవరి 2021 (20:52 IST)
అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే దీనికి అదనంగా జనవరి 2021 పండుగ సీజన్‌లో ప్రయాణికు రద్దీకి అనుగుణంగా మరిన్ని పండుగ ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తుంది. విజయావాడ, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, భువనేశ్వర్‌, హౌరా, ముంబాయి, న్యూ ఢల్లీ, గౌహతి, దానాపూర్‌, జైపూర్‌, నాగపూర్‌, నాందేడ్‌, పర్బాని, ఔరంగాబాద్‌ మరియు సిర్పుర్‌ కాగజ్‌నగర్‌ మొదగు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
 
సంక్రాంతి పండుగ సందర్భంగా మరిన్ని పండుగ ప్రత్యేక రైళ్లను నడపడానికి చర్యలు తీసుకుంటుంది. పండుగ ప్రత్యేక రైళ్లు అన్ని పూర్తిగా రిజర్వేషన్ల రైళ్లే మరియు కన్ఫర్మ్ టికెట్‌ లేని ప్రయాణికులను రైల్వే స్టేషన్లలోకి అనుమతించబడరని ప్రయాణికులు గమనించాలని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సరిపడ రిజర్వేషన్ల కౌంటర్లు ఏర్పాటు చేయబడుతాయి. కింద ఇవ్వబడిన మార్గదర్శకాలను ప్రయాణికులు గమనించాలని తెలిపారు.
 
 
1. కన్ఫర్మ్ అయినటువంటి టికెట్లున్న ప్రయాణికుల మాత్రమే స్టేషన్లలోకి మరియు రైళ్లలోకి అనుమతించబడుతారు.
 
2. ప్రయాణంలో సరైన మాస్క్ ధరించాలి.
 
3. స్టేషన్లలో మరియు రైళ్లలో భౌతిక దూరం పాటించాలి.
 
4. జ్వరం, దగ్గు, జులుబు మొదలగు లక్షణాలున్న వ్యక్తులు ప్రయాణం చేయవద్దని సూచించడమైనది.
 
5. కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులు రైల్వే పరిసరాలకు, రైళ్లలోకి అనుమతించబడరు.
 
6. రైల్వే స్టేషన్లలో నియమించబడిన ఆరోగ్య బృందం వారు ప్రయాణానికి అనుమతించని ప్రయాణికుల ఒకవేళ రైలులో ప్రయాణించినచో అట్టి ప్రయాణం నేరం మరియు శిక్షార్హం.
 
7. బహిరంగ ప్రదేశాలో ఉద్దేశపూర్వకంగా ఉమ్మి వేయడం లేదా మలమూత్రా విసర్జన శిక్షార్హమైన నేరం.
 
8. రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో ప్రయాణికుల ఆరోగ్యం మరియు భద్రతపై చెడు ప్రభావం చూపే విధంగా అపరిశుభ్రమైన లేదా అనారోగ్యమైన పరిస్థితులకు కారణమవడం శిక్షార్హం. 
పైవాటికి తోడుగా కోవిడ్‌`19 వ్యాప్తిని అరికట్టేందుకు మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించడం కోసం ప్రయాణికులందరూ సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరడం జరిగింది.
 
కోవిడ్‌`19 నివారణ ప్రోటోకాల్‌ను ఎవరైనా పాటించని యెడల వారి పట్ల కఠినంగా వ్యవహరించి, రైల్వే చట్టం `1989 ప్రకరాం చర్యలు తీసుకోబడుతాయి.
 
పండుగ దృష్ట్యా ప్రయాణికు సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోబడినవి. అవి కింద విధంగా ఉన్నాయి.
 
1. టెక్కట్లు లేని/సరైన టిక్కెట్లు లేని ప్రయాణికుల తనిఖీ కోసం రైల్వే స్టేషన్ల ద్వారా మరియు రైళ్లలో తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.
 
2. రెగ్యుర్‌ మరియు చివరి నిమిషంలో ప్రయాణం కోసం స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల అవసరాను తీర్చడం కోసం పీఆర్‌ఎస్‌ కేంద్రాలు మరియు స్టేషన్ల వద్ద సరిపడినన్ని రిజర్వేషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేయడమైనది.
 
3. పండుగ ప్రత్యేక రైళ్లన్నీ ముందస్తుగా రిజర్వు చేయబడిన రైళ్లు అనే సమచారాన్ని ప్రయాణికులకు నిరంతరంగా తెలిపే వ్యవస్థను అన్ని రైల్వే స్టేషన్లు మరియు పీఆర్‌ఎస్‌ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.
 
4. అన్ని రైళ్లు రిజర్వుడు మరియు వెయిట్‌ లిస్ట్‌ టికెట్‌‌గా ప్రయాణికులు ఎక్కవద్దని సూచనకై నిరంతరం రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ ఏర్పాటు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెల్మెట్‌ లేకుంటే నో ఎంట్రీ, అయినా వీళ్లు మారరా?