Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతికి పలు రైళ్ల రద్దు-కొన్ని దారిమళ్లింపు

Advertiesment
తిరుపతికి పలు రైళ్ల రద్దు-కొన్ని దారిమళ్లింపు
, గురువారం, 4 మార్చి 2021 (09:08 IST)
తిరుపతి రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా  పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ దక్షిణం వైపు నూతనంగా 6వ నంబర్‌ ప్లాట్‌ఫారం మార్గానికి ప్రధాన రైలు మార్గాలతో అనుసంధానం పనులను శుక్రవారం నుంచి మొదలుపెట్టనున్నారు.

ఈ కారణంగా 12వ తేది వరకు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. ఇంకొన్ని రేణిగుంట నుంచి నడిచేలా చర్యలు తీసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 
 
రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు
5,7,10,12 తేదీల్లో తిరుపతి-విశాఖ డబుల్‌డెక్కర్‌ ఫ5,8,12 తేదీల్లో తిరుపతి-సికింద్రాబాదు రైలు (022769)ఫ5,6,8,9,10,12తేదీల్లో తిరుపతి-పూరి రైలు(07479) ఫ6,9తేదీల్లో తిరుపతి-అమరావతి రైలు (02765)ఫ7,11తేదీల్లో తిరుపతి-బిలా్‌సపూర్‌ రైలు(07481) రాకపోకలను రద్దు చేశారు.

7న తిరుపతి-భువనేశ్వర్‌  రైలు(08480), 8న ఇదే మార్గంలో నడిచే మరో రైలు (02072) రద్దు చేశారు.ఫ11వ తేది తిరుపతి-కొల్హాపూర్‌ రైలు(07415), 10న తిరుపతి-కరీంనగర్‌ రైలు(02761) రద్దు చేశారు.
 
రేణిగుంట నుంచి నడిచే ప్రత్యేక రైళ్లు
11, 12తేదీల్లో కడప,తిరుపతి, విశాఖ మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రె్‌స రైళ్లు(07487-07488)రేణిగుంట నుంచి కడప, విశాఖలకు నడపనున్నారు. తిరుపతి-చెన్నై  మధ్య నడిచే ప్రత్యేక రైళ్ళు (06095-06057-06096-06008) ఈనెల 5నుంచి 12వరకు రేణిగుంట, చెన్నై మధ్య నడుస్తాయి.ఫ విల్లుపురం-తిరుపతి మధ్య నడిచే ప్రత్యేకరైళ్లు(06854-06853)ఈనెల 11, 12తేదీల్లో విల్లుపురం, పాకాల వరకే నడుస్తాయి.
 
దారి మళ్లించిన రైళ్లు
నాగర్‌కోయిల్‌, రామేశ్వరం, యశ్వంతపూర్‌ నుంచి తిరుపతి మీదుగా షాలిమార్‌, ఓకా, టాటానగర్‌, హఠియాల మధ్య రాకపోకలు నిర్వహించే రైళ్లు (02659-06733-02890-02836)కాట్పాడి నుంచి  మేల్పాకం, తిరుత్తణి, రేణిగుంట మీదుగా ఈనెల 8,6,8,11తేదీల్లో రాకపోకలు నిర్వహిస్తాయి.

అలాగే ఈ నెల 5నుంచి మైసూరు-రేణిగుంట మధ్య వారాంతపు ప్రత్యేక రైలు (01065)మైసూరులో శుక్రవారం రాత్రి 10.55గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. తిరిగి ఈ రైలు(01066)అదేరోజు రేణిగుంటలో సాయంత్రం 5.20గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 1.50గంటలకు మైసూరు చేరుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ మూడో కన్ను తెరిచిండు, గజగజ వణుకుతుండ్రు అక్రమార్కులు