Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తేలనున్న తెదేపా మాజీ మంత్రి గంటా భవితవ్యం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:51 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఆయనకు పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఇన్‌ఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు ఈ కబురు వెళ్లింది. శుక్రవారం జరిగే కీలక భేటీలో మొత్తం 12 మందికి ఆహ్వానం వెళ్లింది. 
 
కబురు పంపిన వారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. నిజానికి ఈయన గత 2019 ఎన్నికల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఒకసారి వైకాపాలో మరోమారు బీజేపీలో చేరబోతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఏ రోజూ ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఆ తర్వాత విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి గంటాతో పాటు 12 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి గంటా వస్తారా? లేదా? అన్నది తేలిపోతుంది. ఒకవేళ వస్తే ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశం వుంది. లేనిపక్షంలో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments