Webdunia - Bharat's app for daily news and videos

Install App

భలే బురిడీ కొట్టించారయ్యా.. లేదంటే నా కొంప మునిగేది... కుప్పం నేతలతో చంద్రబాబు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:19 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ స్థానంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు స్థానిక పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. పరోక్షంగా ఆ పార్టీ నేతలకు చురక అంటించినట్టుగా ఉన్నాయి. 
 
అమరావతి ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చంద్రబాబు స్థానిక నేతలతో మాట్లాడుతూ, మొత్తానికి 'భలే బురిడీ కొట్టించారయ్యా' అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు నవ్వుతూ వ్యాఖ్యానించినప్పటికీ పార్టీ నేతలకు మాత్రం తమను ఉద్దేశించే బాబు వ్యాఖ్యలు చేశారని నొచ్చుకున్నారు. 
 
కుప్పం స్థానం నుంచి పోటీ చేసిన చంద్రబాబు.. ఓట్ల లెక్కింపు సమయంలో ఒక దశంలో వైకాపా అభ్యర్థి కంటే వెనుకపడ్డారు. ఆ తర్వాత రౌండ్‌లో ఆధిక్యం సాధించి గెలుపొందారు. అయితే, క్రితంసారితో పోల్చితే ఆయన మెజార్టీ బాగా తగ్గింది. 
 
దీనిపై స్థానిక నేతలు మాట్లాడుతూ, కుప్పంలో కొందరి నేతల వ్యవహారశైలి వల్లే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఆరోపించారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు సూచించారు. 
 
దీనికి చంద్రబాబు స్పందిస్తూ, 'ఈ నెలాఖరున నేను కుప్పం వచ్చి మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటాను. అపుడు అటు జనాలను విస్తృతంగా కలవడంతో పాటు పార్టీలో కూడా ప్రక్షాళన అవసరమైతే చేస్తాను. ఐ విల్ టేక్ కేర్' అంటూ భరోసా ఇచ్చారు. పైగా, 'ఎవరూ అధైర్యపడొద్దు. నేనున్నా.. భవిష్యత్తు మనదే' అంటూ నేతలకు, కార్యకర్తలు చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments