Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేమిచ్చిన తీర్పు కాదు.. మాయదారి మిషన్లు ఇచ్చిన తీర్పు..

మేమిచ్చిన తీర్పు కాదు.. మాయదారి మిషన్లు ఇచ్చిన తీర్పు..
, గురువారం, 30 మే 2019 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఈ ఓటమిని ఏ ఒక్క టీడీపీ కార్యకర్త నమ్మలేకపోతున్నారు. జీర్ణించుకోలేక పోతున్నారు. అన్ని పనులు చేసిన నీవు ఓడిపోవడమేంటయ్యా.. ఇది మేం ఇచ్చిన తీర్పు కాదు.. మాయదారి మిషన్లు ఇచ్చిన తీర్పు అయ్యా అంటూ అనేక మంది మహిళలు వాపోతున్నారు. 
 
ఈ నెల 23వ తేదీన వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు రాగా, వైకాపాకు ఏకంగా 151 సీట్లు వచ్చాయి. అలాగే, టీడీపీకి మూడు లోక్‌సభ సీట్లు రాగా, వైకాపాపు 22 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈ ఫలితాలను టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ శ్రేణులు కూడా నమ్మలేకపోతున్నారు. 
 
ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తన నివాసానికే పరిమితమైన చంద్రబాబును ఓదార్చేందుకు ఆయన నివాసానికి మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తలరివస్తున్నారు. ముఖ్యంగా, మహిళలు అత్యధిక సంఖ్యలో వస్తున్నారు.
 
ఈ సందర్భంగా పలువురు మహిళలు చంద్రబాబుతో మాట్లాడుతూ, నీ వెంట మేమున్నాం. నీ కోసమే వందల కిలోమీటర్లు నుంచి వచ్చాం. ఇంత కష్టపడినా ఓడియామనేదే మా అందరి భాదన్నా. మాలాంటి లేనివాళ్ళు ఎందరికో ఇల్లు ఇచ్చావన్నా. నెలవారీ పింఛన్లు ఇచ్చావయ్యా. నువ్వు చేయని పని ఏదీ లేదయ్యా. అయినా ఓడిపోయామంటే నమ్మలేకపోతున్నాం. పేదలకు ఇన్ని చేసిన నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా.? ఎక్కోడ.. ఏదో జరిగిందయ్యా.. ఇదంతాగ ఏదో మాయగా ఉందయ్యా.. ఇది మేమిచ్చిన తీర్పు కాదయ్యా... మాయదారి మిషన్లు ఇచ్చిన తీర్పు అయ్యా.. ఎపుడూ పని పని అంటూ పరితపించావయ్యా.. పని చేసేవాడిని ఓడించడం ఎక్కడైనా ఉందా? ఏదో మాయ జరిగిందయ్యా అంటూ మహిళలు వాపోతున్నారు. అలాంటి వారికి చంద్రబాబు ధైర్యం చెబుతూ.. మళ్లీ మంచిరోజులు వస్తాయి అందరూ ధైర్యంగా ఉండండి. నిబ్బరంగా ఉండండి అంటూ ఉరడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మహిళ కోసం రంజాన్ ఉపవాసాన్ని వదిలేశాడు..