Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుప్పంపై కన్నేసిన సీఎం జగన్.. ఏంటి సంగతి?

కుప్పంపై కన్నేసిన సీఎం జగన్.. ఏంటి సంగతి?
, సోమవారం, 3 జూన్ 2019 (12:13 IST)
సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలోనే కుప్పంలో నిధుల ఖర్చుపై రాష్ట్ర సచివాలయ ఉన్నతాధికారుల ఆరా తీయడం జిల్లాలో సంచలనంగా మారింది. 2014 నుంచి కుప్పం నియోజకవర్గానికి మంజూరైన నిధులు, వాటి వినియోగం, ప్రస్తుతం ఆ పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు ఇవ్వాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. 
 
జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సంబంధం లేకుండా నేరుగా జిల్లా అధికారులకు ఈ ఆదేశాలు అందడం గమనార్హం. పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, విద్యాశాఖ అధికారులకు అమరావతి నుంచి ఈ మేరకు ఆదేశాలు అందాయి. స్వయంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఈ మేరకు వివరాలు తెప్పించాలని కోరగా, ఆయా శాఖల అధికారులు చిత్తూరు జిల్లా అధికారులకు ఈ లేఖలను ఫార్వర్డ్ చేశారు. 
 
ఆదివారం సెలవు సైతం పక్కన పెట్టి నివేదిక తయారీలో జిల్లా అధికారులు బిజీగా ఉన్నారు. 
కుప్పం నియోజకవర్గ పరిధిలో కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె మండలాలు ఉన్నాయి. గడచిన అయిదేళ్లుగా ఈ నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి.

పంచాయతీ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించారు. ఇందుకోసం దాదాపు 1500 కోట్ల రూపాయల నిధుల వినియోగం జరిగింది. వీటి వివరాలను పంపుతున్నారు. అలాగే అవి ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు నివేదికలో పొందుపరచనున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గ నిధులపై రాష్ట్ర సచివాలయ అధికారుల ఆరా సంచలనంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాదిలో తమిళాన్ని అమలు చేస్తారా? హిందీని బలవంతం చేస్తే యుద్ధమే...