Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి సంబరాలు : నారావారి పల్లెలో చంద్రబాబు సందడి

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (19:57 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ సొంత గ్రామమైన నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
 
అనంతరం చంద్రగిరిలో పార్టీ నేత పులివర్తినానిని పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లపై పోరాటంలో భాగంగా చేపట్టిన నిరసనల్లో అస్వస్థతకుగురైన పులివర్తి నాని ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఓటర్ జాబితాలో అక్రమాలపై మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లె వచ్చిన చంద్రబాబును ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీనేతలు, పలు గ్రామాల ప్రజలు కలిశారు.
 
దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి చంద్రగిరిలో ఇంట్లోనే చికిత్స పొందుతున్న పులివర్తి నానితో మాట్లాడారు. 
 
అనంతరం, మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే టీచర్లను, సీనియర్ అధికారులను, అనుభవం ఉన్నవారిని సిబ్బందిగా నియమిస్తారని, కానీ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోందని విమర్శించారు. వీళ్లకు అనుకూలంగా ఉండే సచివాలయం సిబ్బందిని నియమించి, ఓట్ల అవకతవకలకు గేట్లెత్తారని ఆరోపించారు.
 
తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులోనూ దొంగ ఓట్లు చేర్చారు... పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారు? కొన్ని చోట్ల పోలింగ్ బూత్‌లు మార్చేశారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఒక వ్యక్తికి మూడు బూత్‌ల్లో ఓటు ఉందని వెల్లడించారు. 
 
ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం స్పందించి తిరుపతి జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పులివర్తి నాని చేసే పోరాటం ధర్మపోరాటం అని ప్రశంసించారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
 
'ఇన్ని అక్రమాలు చేయడానికి వీళ్లకు డబ్బులు ఎక్కడ్నించి వస్తున్నాయో అర్థం కావడంలేదు. మొన్నటి వరకు ఈ జిల్లాలో ఎన్నడూ చూడని విధంగా అవకతవకలు జరుగుతున్నాయి. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేనంతగా మనీ పవర్ కనిపిస్తోంది. భూ కబ్జాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు... ఆ డబ్బులు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా యధేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇది పరాకాష్ఠ" అంటూ చంద్రబాబు ఆరోపించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments