Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేరగాళ్లకు అధికారం ఇస్తే పాలన ఇలానే ఉంటుంది : పవన్ కళ్యాణ్

pawan kalyan sleep on road
, ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (09:25 IST)
నేరాగాళ్లు, గూండాలు, రౌడీలకు అధికారం ఇస్తే పాలన ఇలానే ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తీవ్రంగా ఖండించారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరం నుంచి అమరావతికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కొద్దిసేపటి ముందు పవన్ అనుమంచిపల్లి దగ్గర మీడియాతో మాట్లాడారు.
 
ఆ వివవరాలను పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. తనను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా.. బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంత సేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించి ఆలోచిస్తాడు. అందర్నీ జైలుకి పంపాలనే ఆలోచిస్తాడు. అతనో క్రిమినల్. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది అది దురదృష్టం అని అన్నారు. 
 
బెయిల్ మీద బయటకెళ్లే వాడికి ఎంతసేపూ అరెస్టులు చేయాలనే ఆలోచనలే ఉన్నాయి. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్స్ అవ్వాలని కోరుకుంటాడు. అదీ సమస్య. చంద్రబాబు నాయుడిని కలుస్తానని ఎలా ఊహిస్తారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ఎవరు అనుమతిస్తారు. ఏపీ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?. కారణాలు చెప్పడం లేదు. రాకూడదు అంటున్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. 
 
ట్రాఫిక్ అగిపోయింది. చాలా మంది బాధ పడుతున్నారు. విమానంలో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు. కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు. నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. విశాఖలో కూడా ఇలాగే చేశారు. ఏం చేయాలి... గూండాలు, దోపిడి చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. అది అందరికీ అర్థం అవుతుందన్నారు. 
 
ఓ వైపు, జాతీయ స్థాయిలో జీ 20 సమ్మిట్ జరుగుతోంది, దేశానికి చాలా ప్రతిష్టాత్మక సమ్మిట్ జరుగుతోంది. జీ20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి పని చేయడం ప్రధానమంత్రి స్ఫూర్తికి మచ్చ. ప్రధానమంత్రి చాలా కష్టపడి తీసుకువస్తే అన్ని రాష్ట్రాలు సహకరించాలి. దురదృష్టం ఏమిటంటే గూండాలకి అధికారం ఇస్తే జీ 20 తాలూకు విశిష్టత వారికి ఏమర్థమవుతుంది. పోలీసులు కో ఆపరేట్ చేయమని ఆపేశారు తప్ప ఏమీ చెప్పలేదు అని పవన్ వాపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిత్య ఎల్-1 కక్ష్యను మరోమారు పెంచారు.. ఇస్రో వెల్లడి