ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం - కవితకు ఈడీ నోటీసులు

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (19:45 IST)
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం హాజరుకావలంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఈ కేసులో గత యేడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు వించారించారు. తాజాగా మరోమారు నోటీసులు పంపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‍కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు జారీచేసింది. 
 
కానీ, ఆయన మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలంటూ మరోమారు అంటే నాలుగోసారి నోటీసులు జారీచేసింది. అయితే, తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోమారు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇదిలావుంటే ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments