Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీబీసీలో అశ్లీల లింకు షేరింగ్... చానల్ ఎడిటర్‌పై వేటు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:36 IST)
శ్రీవేంకటేశ్వర భక్త చానెల్‌లో అశ్లీల లింక్ షేర్ చేసిన వ్యహారంలో మరో ముగ్గురు ఉద్యోగులపై వేటుపండింది. శ్రీవారికి చెందిన ఈ భక్తి చానెల్‌లో అశ్లీల లింక్ షేర్ అయ్యాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ వ్యవహారానికి సంబంధించి మరో ముగ్గురిపై తాజాగా వేటుపడింది. ఎస్వీబీసీ ఎడిటర్ కృష్ణారావు, చానల్ మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్‌లను సస్పెండ్ చేశారు. వీరితో కలుపుకుని ఎస్వీబీసీ అశ్లీల చిత్రాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిపై వేటు పడినట్టయింది. 
 
ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలతో కూడిన వీడియోలు ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. గతంలో ఓ భక్తుడు ఎస్వీబీసీ చానల్లో ప్రసారమయ్యే 'శతమానం భవతి' కార్యక్రమానికి ఈమెయిల్ పంపాడు. 
 
అయితే ఆ భక్తుడికి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగి ఎంతో నిర్లక్ష్యపూరితంగా ఓ అశ్లీల వీడియో లింకు పంపాడు. దాంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై వైవీ విచారణకు ఆదేశించారు. చానల్లోని పలువురు కీలకస్థానాల్లో ఉన్న ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో అశ్లీల చిత్రాలు చూస్తున్నట్టు గుర్తించి, అప్పట్లోనే కొందరికి ఉద్వాసన పలికారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం