తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన అర్చకులతో పాటు అర్చకులను సైతం తిరిగి తీసుకోవాలని, హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు. మొత్తమ్మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తున్న రమణదీక్షితుల శ్రమ ఫలించింది.