తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాల విక్రయిస్తున్నట్లు వివరణ ఇచ్చిది.
తలనీలాలు కొన్న సంస్థ ఏ ప్రాంతానికి వాటిని పంపుతున్నదో తెలియదు. అక్రమ రవాణా చేస్తున్న సంస్థల పేర్లు ప్రకటిస్తే ఈ-వేలంలో పాల్గొనకుండా వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని తెలిపింది.
మిజోరం సరిహద్దుల్లో ఓ ట్రక్కు నిండా మియన్మార్ బోర్డర్ నుంచి చైనాకు తలనీలాలు స్మగ్లింగ్ చేస్తుండగా సరిహద్దుల్లో కాపలా కాసే అస్సాం రైఫిల్ సిబ్బంది ఈ వాహనాన్ని పట్టుకున్నారు. భారీగా తలనీలాలు స్వాధీనం చేసుకున్నారు. భక్తుల తలనీలాలు స్మగ్లింగ్ చేస్తున్న విషయం ఏపీలో దుమారంగా మారింది. దీంతో తితిదే వివరణ ఇచ్చింది.