Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (18:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆయన చేసిన ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. ఏపీలోని న్యాయ వ్యవస్థను ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డేకు జగన్ ఫిర్యాదు చేశారు.
 
2020 అక్టోబర్ 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపిందని... అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత జగన్ ఫిర్యాదును తోసిపుచ్చడం జరిగిందని సుప్రీంకోర్టు తెలిపింది. 
 
ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్ సైటులో ఈరోజు సమాచారాన్ని ఉంచారు. అయితే ఇన్ హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనదని, దీనికి సంబంధించిన విషయాలు బయటకు వెల్లడించతగినవి కాదని ఆ ప్రకటనలో తెలిపారు.
 
మరోవైపు చీఫ్ జస్టిస్ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా ఎన్వీ రమణను నియమించాలని కేంద్రానికి ఆయన ఈరోజు సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న సుప్రీం చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments