Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశం చీఫ్ జస్టిస్ కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుబిడ్డ?

భారతదేశం చీఫ్ జస్టిస్ కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుబిడ్డ?
, బుధవారం, 24 మార్చి 2021 (12:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుబిడ్డ ఒకరు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికానున్నారు. ఆయన పేరు జస్టిస్ ఎన్వీ.రమణ. అన్నీ కలసి వస్తే ఆయన త్వరలోనే చీఫ్ జస్టిస్ కానున్నారు. 
 
ప్రస్తుతం ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే తర్వాత స్థానంలో ఉన్నారు. ప్రస్తుత సీజే బాబ్డే ఏప్రిల్ 23వ తేదీతో పదవీ విరమణ  చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడి పేరును సిఫారసు చేయాలని ప్రభుత్వం సీజేఐని కోరింది. 
 
ఈ పరిస్థితుల్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం జస్టిస్ బాబ్డేకు ఓ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇందులో తన వారసుడుగా ఎన్వీ రమణ పేరును ఆయన సిఫార్సు చేసినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, ఎన్వీరమణ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌గా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. కాగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆయన పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాశారు.
 
నిజానికి ఇప్పుడున్న వారిలో సీనియర్ జస్టిస్ ఎన్వీ రమణ మాత్రమే. సీనియారిటీ ప్రకారం చీఫ్ జస్టిస్ పదవి ఆయనకే దక్కాల్సి ఉంది. సీజే ప్రతిపాదించిన పేరును కేంద్ర ప్రభుత్వం కొలిజియానికి పంపితే ఫైనల్ అయినట్లే. అన్నీ అనుకూలిస్తే సుప్రీంకోర్టు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు ప్రతిపాదించారు. 
 
ఎన్వీ రమణ కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా 16 నెలలు పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు.
 
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్‌గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.
 
2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇసుక ఉచితంగా ఇవ్వాలి:సోమువీర్రాజు