Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

సెల్వి
శనివారం, 22 నవంబరు 2025 (10:00 IST)
భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి భార్యనే అతనిని ఆస్పత్రిలో చేర్చింది. పెళ్లైన ఆ వ్యక్తికి ఓ పాప కూడా వుంది. 
 
అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని ఏకంగా ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబసభ్యులు అతని ఇంటికి వచ్చి గొడవ చేశారు. అంతేకాదు ఆమెను తిరిగి ఊరికి తీసుకెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన అతను నా నుంచి ఆమెను దూరం చేయకండంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది.
 
కలిగిరి మండలంలోని ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు ఎనిమిదేళ్ల క్రితం సరిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. విష్ణువర్ధన్‌ అనకాపల్లి సమీపంలోని ఇటుకబట్టీల్లో మూడేళ్లుగా భార్యతో కలిసి  పనిచేస్తున్నాడు.  ఆ క్రమంలో అక్కడే పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటున్న ఎం.ధనలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి భార్యే అతనిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవి ని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments