Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు విద్యార్థుల మృతి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:45 IST)
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఘోరం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి చిలకలూరు పేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. 
 
విజయవాడలోని ఓ కాలేజీలో ఆర్కిటెక్చర్ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య, పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ)లు ఓ కారులో చిలకలూరిపేటకు బయలుదేరారు. ఈ కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. కారు వేగంగా వస్తుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments