ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో జరిగింది.
సోమవారం తెల్లవారుజామున లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామస్థులుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.