హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కావాల్సివుంది. కానీ ఒక్కరోజు తర్వాతకు జరిగింది. అంటే ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందుకు కారణం పెద్దగా లేకపోయినా శనివారం సెంటిమెంట్‌గా ఫీలయ్యారని అడిగితే, అదేమీ లేదు. 12న పలు సినిమాలు విడుదల వున్నాయని తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ, కృష్ణతత్త్వంతో కూడిన కథ ఇది. భాగవతంలోని ఓ అంశాన్ని తీసుకుని సినిమా మలిచాం. నిఖిల్ అద్భుతంగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ సరైన పాత్ర పోషించింది అన్నారు.
నిఖిల్ తెలుపుతూ, ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇది యూనిక్ కథ. అందుకే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇందుకు కథ ప్రదాన బలం. మా సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషించారు. ఇది అందరికీ నచ్చే కథ. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతోంది అని చెప్పారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, కార్తికేయలో నేను నటించలేదు. ఇందులో కథ ప్రకారమే నా పాత్ర వుంటుంది. యూనిక్ సబ్జెక్ట్‌లో చేయడం చాలా ఆనందంగా వుంది. కథ, కథనం ఆట్టుకునేలా వుంటాయని చెప్పారు. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేనితోపాలు టెక్నీషియన్ పనితనం చిత్రానికి హైలైట్‌గా వుంటుందని నిర్మాతలు తెలిపారు.