Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బ‌స్సుల్లో శ్రీవారి శీఘ్ర ద‌ర్శ‌నం టిక్కెట్లు... ఛార్జీపై అద‌నంగా రూ.300 చెల్లించి టిక్కెట్లు బ‌స్సుల్లోనే పొందే వీలు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (09:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఆయా బస్సుల్లో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయ‌ని ఏపిఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్పీ ఠాకూర్ విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఏపిఎస్ ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అమూల్యమైన ఈ అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్టును పొందవచ్చు.

ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది. తిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంత‌రం శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ‌స‌హ‌కారాలు అందిస్తారు.

ఈ క్ర‌మంలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో శీఘ్ర దర్శనం టికెట్టును పొంద‌ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రతి రోజు తిరుపతికి ఆర్టీసీ సంస్థ 650 బస్సులు నడుపుతుంది.

ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం విచ్చేసే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments