Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్గి పెట్టి ఉందా? అని ఓ యువకుడిపై దాడి.. హత్య.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (09:30 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఖలా వరంగల్‌లో ఓ యువకుడుని కొందరు వ్యక్తులు ఉత్తిపున్నానికే కొట్టి చంపేశారు. అగ్గిపెట్టి ఉందా అంటూ ఆ యువకుడు అడిగాడు. ఈ మాటకే ఆగ్రహించిన ఆ ముఠా అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఆకెన పవన్‌కల్యాణ్‌ (23) తన స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు లేబర్‌కాలనీలోని ఎంఎన్‌కే ఎలైట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. 
 
మద్యం తాగిన తర్వాత రెస్టారెంట్‌ ప్రాంగణంలో ఉన్న పాన్‌షాపునకు వెళ్లి సిగరెట్‌ కొనుగోలు చేశారు. అగ్గిపెట్టె కావాలని బార్‌ అండర్‌ రెస్టారెంట్‌లో నుంచి బయటకు వస్తున్న శివనగర్‌కు చెందిన కుసుమ యశ్వంత్‌ (25)ను అడిగాడు.
 
దీంతో ఆగ్రహానికిగురై అతడి స్నేహితులైన శివనగర్‌కు చెందిన కందగట్ల నాగరాజు (24), మామిడాల రేవంత్‌ (19), బల్ల కార్తీక్‌ అలియాస్‌ బల్ల (19), మాచిక రాజేశ్‌ (20), బంబక్‌ ఆకాశ్‌ (29)తో కలిసి దాడి చేశారు. 
 
ఈ దాడిలో తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన పవన్‌ కల్యాణ్‌ను ఎంజీఎం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తరపు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా 19 ఏళ్ల యువకులను బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లోకి అనుమతించి మద్యం విక్రయించిన బార్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments