Webdunia - Bharat's app for daily news and videos

Install App

చూస్తుండగానే జెయింట్ వీల్ తొట్టి ఊడి పదేళ్ల బాలుడు మృతి(Video)

చిన్నపిల్లలు వేసవి శెలవులు వచ్చాయంటే సరదాగా గడిపేందుకు ఎక్కడికైనా తీసుకెళ్లమని తమ తల్లిదండ్రులను అడుగుతుంటారు. ఐతే అలాంటి సరదా అనంతపురంలో ఓ బాలుడి ప్రాణాన్ని కబళించింది. వివరాల్లోకి వెళితే... ఆదివారం నాడు అనంతపురంలో ఓ ఉత్సవం జరుగుతోంది. అక్కడ జెయింట్

Webdunia
సోమవారం, 28 మే 2018 (18:44 IST)
చిన్నపిల్లలు వేసవి శెలవులు వచ్చాయంటే సరదాగా గడిపేందుకు ఎక్కడికైనా తీసుకెళ్లమని తమ తల్లిదండ్రులను అడుగుతుంటారు. ఐతే అలాంటి సరదా అనంతపురంలో ఓ బాలుడి ప్రాణాన్ని కబళించింది. వివరాల్లోకి వెళితే... ఆదివారం నాడు అనంతపురంలో ఓ ఉత్సవం జరుగుతోంది. అక్కడ జెయింట్ వీల్... తదితరాల్లో పిల్లలు ఎక్కి కేరింతలు కొడుతున్నారు. జెయింట్ అలా తిరుగుతూ వున్న సమయంలో బోల్టు ఊడి జెయింట్ వీల్‌కు వేలాడే తొట్టి ఊడిపోయింది. దాంతో అందులో వున్న పదేళ్ల బాలుడుతో సహా కిందపడటంతో ఆ పిల్లవాడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. 
 
కాగా జెయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో సదరు పిల్లవాడు ఎక్కిన తొట్టికి సంబంధించి బోల్టు వదులుగా వుందని అక్కడివారు అరిచినా దాన్ని నడిపే వ్యక్తి పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతడు పూటుగా తాగి వుండటంతో తమ మాటలను పెడచెవిన పెట్టాడని తెలిపారు. మరోవైపు పిల్లవాడు మరణించడంతో ఆగ్రహం చెంది పలువురు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూడండి ఆ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments