నీ భార్యతో నాకు లింకుంది... కిక్కులో చెప్పేసిన ఫ్రెండ్: చెప్పావా? ఐతే చంపేయమన్న భార్య
వివాహేతర సంబంధం బయటపడితే హత్యలు తప్ప మరొకటి కనబడటంలేదు. తాజాగా హైదరాబాదులో ఏకంగా తన స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం వున్నట్లు అతడే చెప్పడంతో అది హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని సనత్ నగర్‌లో మహ్మద్ ఖాజా, సలేహ బేగం కాపురముంటున్
వివాహేతర సంబంధం బయటపడితే హత్యలు తప్ప మరొకటి కనబడటంలేదు. తాజాగా హైదరాబాదులో ఏకంగా తన స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం వున్నట్లు అతడే చెప్పడంతో అది హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని సనత్ నగర్‌లో మహ్మద్ ఖాజా, సలేహ బేగం కాపురముంటున్నారు. ఖాజా డ్రైవరుగా పనిచేస్తుండటంతో అతడికి స్నేహితులు కూడా కాస్త ఎక్కువే. ఐతే వారిలో ముగ్గురు మాత్రం మంచి దోస్తులయ్యారు. ఈ క్రమంలో వీరిలో ఖురేషి అనే వ్యక్తి ఖాజా ఇంట్లో లేని సమయాన్ని చూసి ఇంటికి రావడంతో సలేహా బేగంతో చనువు ఏర్పడింది. దాంతో అది అక్రమ సంబంధానికి దారితీసింది. ఖురేషి తనకు సన్నిహితుడు కావడంతో ఖాజా అప్పుడప్పుడు అతడితో కలసి మద్యం సేవిస్తుండేవాడు.
కానీ ఏమైందో తెలియదు కానీ ఖాజా ఓ రోజు రైల్వే ట్రాక్ పైన చనిపోయి పడి వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్య కేసు అని తొలుత భావించారు కానీ శవం పడి వున్న తీరు, రక్తపు మరకలు చూసి అది ఆత్మహత్య కాదనీ, ఎవరో హత్య చేసి రైల్వే ట్రాక్ పైన పడేసి వెళ్లారని గుర్తించారు. ఆ శవం ఎవరిదో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తుండగా సలేహా తన భర్త కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు శవం ఖాజాదేనని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఖాజాను హత్య చేయించింది తనేనని అతడి భార్య అంగీకరించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం... ఖురేషితో పాటు మరికొందరు మాదాపూర్ శివార్లలో మద్యం సేవించారు. చివిరికి ఖురేషి, ఖాజా మాత్రమే మిగిలారు. పూటుగా మద్యం సేవించిన ఖురేషి... ఖాజా భార్యతో అక్రమ సంబంధం వుందని చెప్పాడు. దాంతో ఖాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్యపై మండిపడ్డాడు. గొడవకు దిగాడు. దీనితో ఆ రోజు రాత్రంతా ఆలోచన చేసిన ఖాజా భార్య, ఖురేషికి ఫోన్ చేసి తమ మధ్య వున్న సంబంధాన్ని ఎందుకు బయటపెట్టావంటూ నిలదీసింది.
ఇక తన భర్త తనను వేధిస్తుంటాడనీ, కనుక అతడిని చంపేస్తేనా ప్రశాంతంగా వుండొచ్చని అతడితో చెప్పింది. ఆ క్రమంలో తన భర్తను హత్య చేసేందుకు అజయ్, అక్బర్, షేక్ జహీర్ అనే ముగ్గురు వ్యక్తులతో రూ. 2 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. వీరంతా పథకం ప్రకారం ఖాజాకు బాగా మద్యం తాగించి మైకంలోకి వెళ్లిపోగానే అతడి తలపై మోది హత్య చేశారు. ఆ తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఆ శవాన్ని రైలు పట్టాలపై పడేశారు. దర్యాప్తులో వాస్తవాలు వెలికి రావడంతో ఖాజా భార్యతో సహా నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.