Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:26 IST)
సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆర్థిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శిగా  బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ మొదటి అంతస్తులో తన చాంబర్లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. ముఖేష్ కుమార్ మీనా  పరిశ్రమల (ఆహార శుద్ది) శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
 
 
గతంలో ఎపి గవర్నర్ ఒఎస్డి గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన మీనా తర్వాత బదిలీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ప‌నిచేసిన‌పుడు మీనా అటు గ‌వ‌ర్న‌ర్ కు, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప‌ని చేశార‌ని, వివాదాల‌కు తావు లేకుండా విధి నిర్వ‌హణ చేశార‌నే గుర్తింపును పొందారు. మొద‌టి నుంచి ముకేష్ కుమార్ మీనా సౌమ్యుడిగా, ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరుంది.


ఇపుడు కొత్తగా ఆర్ధిక శాఖలో చేరిన మీనా మీడియాతో మాట్లాడుతూ,  ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు వాణిజ్య పన్నులను పూర్తి స్థాయిలో సమర్థ వంతంగా వసూలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పన్ను ఎగవేత దారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జీఎస్టీకి సంభందించిన ఇబ్బందులను అధిగమించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని మీనా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments