Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరందాటిన వాయుగుండం

Advertiesment
చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరందాటిన వాయుగుండం
, శుక్రవారం, 19 నవంబరు 2021 (08:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై - పుదుచ్చేరి ప్రాంతాల మధ్య తీరందాటిందని భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. 
 
అయితే, దీని ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే వున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో జలాశంయ 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 
 
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా అటుగా వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ భారీ వర్షంతో తిరుపతి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునిపోయింది. తిరుమల ఘాట్ రోడ్లను మూసివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం - నేడు తెలంగాణాలో భారీ వర్షాలు