Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో కొండంత వర్షం : నీట మునిగిన తిరుపతి పట్టణం

Advertiesment
Heavy Rain
, శుక్రవారం, 19 నవంబరు 2021 (07:16 IST)
తిరుపతి పట్టణం నీట మునిగింది. తిరుమలగిరుల్లో కొండత వర్షం కుంభవృష్టి కురిసింది. దీంతో తిరుపతి పట్టణం నీట మునిగింది. ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. రోడ్లపై ప్రవహిస్తున్న వరదకు కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. 
 
ఈ వరద ప్రవాహంపై తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు. తిరుపతిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ ఏ ఒక్కరూ బయటకు రావొద్దంటూ కోరారు. ముఖ్యంగా తిరుపతి నుంచి నెల్లూరుల, చెన్నై వేళ్ళేవారు పుత్తూరు, నాగలాపురం, సత్యవేడు, తడ మీదుగా వెళ్లాలని సూచించారు. 
 
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి పట్టణ పురపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల సహాయం కోసం 0877 2256766 అనే ఫోన్ నంబరురో సంప్రదించాలని కోరారు. 
 
అటు తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రెండు ఘాట్ రోడ్లను మూసివేశారు. అలిపిరి కాలినడక మార్గాన్ని కూడా మూసివేశారు. దీంతో తిరుమల, తిరుపతి ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, ఘాట్ రోడ్లు క్లోజ్