Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతికి రాకండి... స్థానిక ప్రజలు ఎవ్వరూ బయటకు రాకండి…

తిరుపతికి రాకండి... స్థానిక ప్రజలు ఎవ్వరూ బయటకు రాకండి…
విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (18:12 IST)
గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదు అని పోలీసులు సూచించారు. రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తలు వహించాలని, పలు ప్రాంతాలలో రోడ్లు దెబ్బతినడం వలన ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
 
 
వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఎత్తయిన టవర్లకు నిప్పు నిలబడరాదని, పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పాత కట్టడాలు, బలహీన కట్టడాల వంటి నిర్మాణాలలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వర్షాల కారణంగా ఇప్పటికే తిరుపతి పరిసర ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయని, పలు ప్రాంతాలలో వరదలు ప్రవహిస్తున్నాయి అని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

 
ఆయా ప్రాంతాలలో సంబంధిత పోలీసు స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. అత్యవసర  సమయంలో వరదకి గురైన ప్రాంతాలలో సహాయక చర్యల అందించడానికి ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం, పోలీసు ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు.
 
 
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి వెలుపలికి రాకూడదని, అత్యవసర సహాయం కోసం డయల్ 100, పోలీస్ వాట్సాప్ 8099999977, కంట్రోల్ రూమ్ 6309913960 నంబర్లకు సమాచారం అందిస్తే, వెంటనే సంబందిత పోలీస్ సిబ్బంది సహాయం అందించడానికి అందుబాటులో వస్తార‌ని తెలిపారు. పోలీస్ సూచనలను పాటిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు విజ్ఞప్తి చేసారు. 

 
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో గాలులతో కూడిన వర్షం పడుతోంది. పంబలేరు వాగు ఉదృతంగా రోడ్ పైకి ప్రవహిస్తోంది. ఆ రహదారిని మరమత్తుల కోసం ఇదివరకే వాహనాలు అటు రాకుండా నిలిపి వేశారు. ఉదయగిరి ప్రధాన పట్టణం లో డ్రైనేజీ కాలువలు పొంగి   మురుగునీరు రోడ్లపైకి చేరాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల లో  నీరు ఇళ్లలోకి చేరాయి. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికీ  సహాయ సహకారాలను అందించాలని అధికారులకు  తగు సూచనలు అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విఐటి-ఎపి, ఇంటెల్ ఐటి సొల్యూషన్స్ మధ్య అవగాహన ఒప్పందం