Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విఐటి-ఎపి, ఇంటెల్ ఐటి సొల్యూషన్స్ మధ్య అవగాహన ఒప్పందం

Advertiesment
vit ap
విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (17:50 IST)
విఐటి-ఎపి విశ్వవిద్యాలయం,  ఇంటెల్‌ మధ్య మెమోరాండం ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్ సంతకం కార్యక్రమం నేడు వర్చ్యువల్ విధానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి,  ఇంటెల్ కంట్రీ మేనేజర్, సప్లై చైన్,  జితేంద్ర చద్దా ఎం.ఒ.యు.పై సంతకాలు చేసారు.  
 
 
విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చెయ్యటం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఐ ఓ టి అనేది ఒక అధునాతన సాంకేతికత, ఇది ఇంటర్నెట్ ద్వారా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయగల, డేటాను మార్పిడి చేయగల యంత్రాలు మరియు పరికరాల యొక్క గ్లోబల్ నెట్‌వర్క్‌ను సృష్టించటానికి ఉపయోగపడుతుంది. ఈ సెంటర్ ద్వారా పరిశ్రమకు, విద్యార్థులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి మరియు అధ్యాపకులు, విద్యార్థులు IoT- సంబంధిత సమస్యలపై పరిశోధన చేయడానికి , కొత్త పద్ధతులు, అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతోంది.
 
 
ఇదే రోజు విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మరియు బోస్టన్ ఐటి సొల్యూషన్స్  మధ్య ఎం.ఓ.యు సంతకం కార్యక్రమం కూడా వర్చ్యువల్ విధానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి, గ్లోబల్ హెడ్ అఫ్ ఏ.ఐ. ఎడ్యుకేషన్ అండ్ సోలుషన్స్ లక్ష్మి నాగేశ్వరి  మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకాలు చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్‌లో తాజా సాంకేతికతలపై ఉమ్మడి పరిశోధన  కన్సల్టెన్సీ పనిని నిర్వహించడం, రియల్‌టైమ్ అప్లికేషన్‌లను సంయుక్తంగా రూపొందించడం దీని ప్ర‌ధాన ఉద్దేశం. అంతే కాకుండా విద్యార్థులు వారి విద్యా అవసరాలతో పాటు సామర్థ్యాలను పెంపొందించడానికి ఇంజనీరింగ్ వాతావరణంలో పని చేయడంలో అనుభవాన్ని పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది.
 
 
ఈ కార్యక్రమాలలో విఐటి-ఎపి విశ్వవిద్యాలయ డైరెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్‌ డా|| హరి సీత, డీన్ (స్కూల్ అఫ్ కంప్యూటర్ సైన్సు అండ్ ఇంజనీరింగ్) డా|| ఎస్.వి.సుధా,   ఇంటెల్ ప్రోగ్రాం హెడ్ గిరీష్ , డైరెక్టర్  సుమీత్,  ప్రదీప్,  బోస్టన్ ఐటి సోలుషన్స్ నుండి వెంకట్ త‌దిత‌రులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మహిళలే భాగస్వాములుగా ఉండే డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించిన అమెజాన్