రైతన్నల విజయం : కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం.. ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (09:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోనుంది. ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గత యేడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు విజయం సాధించారు. 

 
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగింది. సాగు చట్టాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ వ్యాప్తంగా కిసాన్ ఉద్యమాలు హోరెత్తాయి. ముఖ్యంగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగాసాగింది.

 
రైతులు ఢిల్లీ ఎర్రకోట వేదికగా చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. పైగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోడీ తాజా ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments