Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఘా నీడలో తిరుమల తిరుపతి.. తస్మాత్ జాగ్రత్త..!

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:38 IST)
దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.


దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించగా, తిరుమలతో పాటు ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు.
 
ప్రయాణికులు, యాత్రికులు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు చెప్తున్నారు. యాత్రికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు, పోలీస్‌ వాట్సప్‌ నెంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బాంబు, డాగ్‌ స్క్వాడ్లు రైల్వేస్టేషన్లు, బంస్టాండ్లు, అతిథి గృహాలు, దేవాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. 
 
రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుమల ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లగేజీని పరిశీలించి అనుమానాలు తీరిన తర్వాతే ఎవరినైనా వదిలిపెడుతున్నారు. శ్రీలంకలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు భారత్‌ను టార్గెట్ చేసినట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారం అందించిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments