తిరుమలలో భార్యతో కలిసి రథాన్ని లాగిన దర్సకుడు త్రివిక్రమ్

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:51 IST)
ప్రముఖ సినీ దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామిసేవలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. త్రివిక్రమ్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. క్యూలైన్లో అందరితో కరచాలనం చేశారు త్రివిక్రమ్.
 
ఆలయం బయటకు రాగానే వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ తన భార్యతో కలిసి స్వర్ణరథాన్ని లాగారు. గోవిందా గోవిందా అంటూ గోవిందనామస్మరణలు చేశారు. త్రివిక్రమ్ రథాన్ని లాగడాన్ని భక్తులు ఆశక్తిగా తిలకించారు. ఆలయం బయట కూడా భక్తులు అందరికీ కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ వెళ్ళారు త్రివిక్రమ్.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మ‌హేష్ మ‌హ‌ర్షికి గుమ్మ‌డికాయ కొట్టేసారు..!