ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దంటూ కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో చేసిన ధన్యవాద తీర్మానాన్ని ఉపసంహరించుకున
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దంటూ కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ అసెంబ్లీలో చేసిన ధన్యవాద తీర్మానాన్ని ఉపసంహరించుకున్నారా? అంటూ ప్రశ్నించారు. అలాగే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్రానికి పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని కూడా విత్‌డ్రా చేసుకున్నారా? అంటూ బాబుపై ప్రశ్నాస్త్రాలు సంధించారు.
ఇవేమీ ఉపసంహరించుకోకుండా కేంద్రంపై పోరాటమంటూ డ్రామాలు ఆడుతున్నారా?, ఒకవేళ ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత కల్పించి ఉంటే ప్రత్యేక హోదాకు పర్మినెంట్‌కు అన్ని దారులు మూసుకుపోయేవని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక విభజన హామీల అమలుపై హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేస్తాననడం కూడా పొలిటికల్ డ్రామానేనని ఆయన ధ్వజమెత్తారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, వైకాపా చీఫ్ జగన్ సీఎం కావడం ఖాయమని రోజా జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ప్రతిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.