Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను వుండగానే టీనేజ్ అమ్మాయితో నా భర్త రాసలీలలు... ఎమ్మెల్యే భార్య ఆరోపణ

భాజపాకు చెందిన జమ్ము-కాశ్మీర్ ఎమ్మెల్యే గగన్ భగత్ భార్య అతడిపై ఆరోపణలు చేసింది. కట్టుకున్న భార్యను నేను వుండగానే నా భర్య మరో టీనేజ్ అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడనీ, ఆమెను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడంటూ ఆరోపణలు చేసింది. శుక్రవారం నాడు ఏకంగా మీడియ

Advertiesment
నేను వుండగానే టీనేజ్ అమ్మాయితో నా భర్త రాసలీలలు... ఎమ్మెల్యే భార్య ఆరోపణ
, శనివారం, 14 జులై 2018 (14:02 IST)
భాజపాకు చెందిన జమ్ము-కాశ్మీర్ ఎమ్మెల్యే గగన్ భగత్ భార్య అతడిపై ఆరోపణలు చేసింది. కట్టుకున్న భార్యను నేను వుండగానే నా భర్య మరో టీనేజ్ అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడనీ, ఆమెను రహస్యంగా వివాహం కూడా చేసుకున్నాడంటూ ఆరోపణలు చేసింది. శుక్రవారం నాడు ఏకంగా మీడియా ముందుకు వచ్చింది. తన భర్త టీనేజ్ అమ్మాయితో చేస్తున్న సరససల్లాపాలు తాలూకు ఫోటోలను మీడియా ముందు వుంచింది. ఇన్నాళ్లు తన వద్ద ఆధారాలు లేకపోవడంతో ఏమీ మాట్లాడలేకపోయాననీ, ఇప్పుడు ఆధారాలతో ముందుకు వచ్చానని వెల్లడించింది. 
 
తనకు అన్యాయం చేసిన తన భర్తపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఐతే తన భార్య మోనికా ఆరోపణలు నిరాధారమైనవని ఎమ్మెల్యే గగన్ కొట్టిపారేస్తున్నారు. తామిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయనీ, విడాకులు కావాలని ఆమె కోరినా... పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా వద్దని చెప్పానని వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై కౌన్సిలింగ్ జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో ఆమె తనపై చేసిన విమర్శలన్నీ అవాస్తవమంటూ ఆయన ఖండించారు.
 
మరోవైరు సదరు టీనేజ్ బాలిక మాట్లాడుతూ... గగన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. ఆయన చాలా మంచి వ్యక్తి అనీ, ఎవరో కిట్టనివారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వెల్లడించింది. ఐతే సదరు విద్యార్థిని పేరెంట్స్ మాత్రం గగన్ తమ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని ఆరోపణలు చేయడం గమనార్హం. మరి దీనిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదు: వసీం రిజ్వీ సెన్సేషనల్ కామెంట్స్