Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా దెబ్బకు దిగివచ్చిన చంద్రబాబు... తిరుమల శ్రీవారితో ఎందుకండీ అంటూ... (Video)

‘‘ఏదో జరుగుతోందబ్బా.. తిరుమల వేంకటేశ్వరుడిని కొల్లగొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందా.? టీటీడీలో జరిగిన అక్రమాల గుట్టు బయటపడకుండా సంప్రోక్షణ పేరుతో గుడిని మూసేవేసి ఏదో చేయబోతోందా.? భక్తుల్ని అస్సలు అనుమతించకూడదనే నిర్ణయం వెనుక పెద్ద కుట్రే

Advertiesment
RK Roja challenge
, మంగళవారం, 17 జులై 2018 (13:05 IST)
‘‘ఏదో జరుగుతోందబ్బా.. తిరుమల వేంకటేశ్వరుడిని కొల్లగొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందా.? టీటీడీలో జరిగిన అక్రమాల గుట్టు బయటపడకుండా సంప్రోక్షణ పేరుతో గుడిని మూసేవేసి ఏదో చేయబోతోందా.? భక్తుల్ని అస్సలు అనుమతించకూడదనే నిర్ణయం వెనుక పెద్ద కుట్రే ఉందా.?’’ ఇవీ.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యక్తపరిచిన అభిప్రాయాలు.. రోజానే కాదు.. టీటీడీ వ్యవహారాలు ఎన్నో ఏళ్ల నుంచి దగ్గరి నుంచి చూసిన అధికారులు, స్థానిక ప్రజలు కూడా గుడిని సంప్రోక్షణ పేరుతో మూసేయాలనే నిర్ణయం వెనుక మతలబు ఏదో ఉందనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. 
 
గుడిని మూసివేసి.. సిసీ కెమెరాలు ఆపుచేసి  ఏదో చేయబోతున్నారనే  ప్రచారం ఊపందుకుంది.. 
టీటీడీ వ్యవహారాలపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అప్పట్లో పలు సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి నగలు కాజేస్తున్నారని.. స్వామి వారి విలువైన వజ్రాన్ని విదేశాలకు తరలించారని.. టీటీడీలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు స్వామి విలువైన ఆభరణాలు దోచుకుంటున్నారని  విమర్శలు చేశారు. ఈ ఆరోపణలకు టీడీపీ ఎన్ని వివరణలు ఇచ్చినా అవి సంతృప్తి పరచలేదు.
 
తాజాగా టీటీడీ అక్రమాలపై పోరాడుతున్న సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతున్నారు. సుప్రీం కనుక స్పందించి విచారణ చేయిస్తే గుడిలో చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. అందుకే ‘ఇలా సంప్రోక్షణ పేరుతో అక్రమాలను కప్పేయడానికి టీడీపీ ప్రభుత్వం గుడిని మూసివేస్తోందా’ అని తాజాగా ఎమ్మెల్యే రోజా తిరుమలలో సంచలన ఆరోపణలు చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని రోజా వ్యాఖ్యానించారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా టీటీడీ తీరు ఉందని ధ్వజమెత్తారు. 
 
గుడిని మూసివేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని.. దీన్ని ఎదుర్కొనేందుకు తిరుమల భక్తులు, స్థానికులతో కలిసి ఆందోళన చేస్తామని రోజా హెచ్చరించారు. ఎమ్మెల్యే రోజా హెచ్చరికలతో చంద్రబాబు దిగివచ్చారు. తిరుమల దేవాలయాన్ని మూసివేసి గుట్టుగా చేద్దామనుకున్న పనులపై నిర్ణయాన్ని మార్చుకున్నారన్న వాదన వినబడుతోంది. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని తాజాగా ఆదేశించారు. 
 
ఎమ్మెల్యే రోజా తిరుమల భక్తుల పక్షాన పోరాడుతానని ప్రకటించడం... ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు వ్యక్తపరచడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. వివాదం పెద్దది కాకముందే దిద్దుబాటు చర్యలకు దిగారు. కానీ ఇప్పటికీ టీటీడీలో అక్రమాలపై రోజా సంధించిన ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సమాధానమే లేకుండా పోయిందనేది వాదన. రోజా వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయనీ, టీడీపీ నేతలు తిరుమల వెంకన్న గుడిలో గూడుపుఠాణి చేయకుండా రోజా అడ్డుకుందంటూ స్థానిక భక్తులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా మహాసంప్రోక్షణ పేరుతో తిరుమల ఆలయంలో అక్రమాలను చెరిపేసుకుందామనుకున్న టీడీపీ నేతలకు రోజా అడ్డుగా నిలబడి గట్టి షాకే ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. రోజా వ్యాఖ్యలు... వీడియోలో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై అక్కడ బహిరంగ మద్యపానం నిషేధం.. తాగితే ఫైన్