Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం 2020 నమోదు ప్రక్రియకు శ్రీకారం

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:10 IST)
మాలక్ష్మి గ్రూప్ , కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి (సిసివిఏ) సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020 నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు సంస్థల సీఈవో సందీప్ మండవ విజయవాడ సిసివిఏ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 
సిసివిఏ గత 5 సంవత్సరాలుగా, విజయవాడలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి అనూహ్య స్పందన లభించటమే కాక, వరుసగా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్‌ను కూడా  సొంతం చేసుకొoదని కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివ నాగి రెడ్డి తెలిపారు.
 
దేశ విదేశాలలోని బహు భాషా కవులు నవంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకొని కవితలను పంపవచ్చని తెలిపారు. మాలక్ష్మి గ్రూపు సంస్థల సీఈవో సందీప్ మండవ మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విడత ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
 
రచయితల నుండి వచ్చిన కవితల్లో 100 ఉత్తమ కవితల్ని ఎంపిక చేసి ఆయా కవులను అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తమ కవితలను వినిపించటానికి ఆహ్వానిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న కవులు “సిసివిఏ.ఇన్”లో లాగిన్ అయ్యి తమ పూర్తి వివరాలను నమోదు చేయటం ద్వారా అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020లో పాల్గొనగలుగుతారన్నారు. మాలక్ష్మి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని సందీప్ మండవ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments