Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ పోలీస్ యాప్ ప్రారంభం, 87 రకాల సేవలు

ఏపీ పోలీస్ యాప్ ప్రారంభం, 87 రకాల సేవలు
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (14:17 IST)
దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల  సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు.
 
అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు.. అంతే కాకుండా ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా యాప్‌ను రూపొందించారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ ఏపీ పోలీస్‌ సేవ యాప్‌‌.
 
ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ అందించే సేవలు ఏమిటంటే.. దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు.
 
ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా వుంది.
 
ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో 'మహిళలకు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది.
 
రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్భాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (SOS) స్వల్ప వ్యవధిలోనే 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 568 మంది నుండి ఫిర్యాదులు స్వీకరించగా 117 యఫ్.ఐ.ఆర్ లను నామోదు చేసి చర్యలు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌