Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో కాదు 29నే రేషన్‌.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (05:23 IST)
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రేషన్‌ను ఈ నెల 29నే ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది.

దీంతోపాటు ఒక్కో కార్డుదారుడికి రూ.వెయ్యి నగదు కూడా అందజేయనున్నట్లు సీఎస్‌ నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులిచ్చారు. కరోనాను నియంత్రించేందుకు ఇప్పటికే సర్కారు బయోమెట్రిక్‌ విధానాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. 
 
ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. 
- ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన బియ్యం, ఒక కేజీ కందిపప్పును కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నాం. 
- వాస్తవానికి ఇవి ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంది. కానీ, మార్చి 29నే ఇస్తున్నాం 
- ఉచితంగా రేషన్‌తో పాటు రూ.వెయ్యి నగదు కూడా అందజేస్తున్నాం. 
- ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా సకాలంలో వేతనాలు అందిస్తాం. 
- ప్రైవేటు సంస్థలు కూడా విధిగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. 
- నిబంధనలు అతిక్రమించిన సంస్థలపై చర్యలు తీసుకుంటాం 
- నిత్యావసరాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments