Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కోస్తా ఆంధ్రాలో వర్షాలు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:09 IST)
ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటన విడుదల చేశారు.

తూర్పు మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న చత్తీస్ గఢ్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఈ రోజు విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో  అక్కడ అక్కడ  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km) పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలోని చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో పాటు, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది.

రేపు  ఉత్తర కోస్తా ఆంధ్రాలోని చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
 
ఈ రోజు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km) పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
        
ఈ రోజు కడప  జిల్లాలో అక్కడ అక్కడ  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km)  రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది మరియు అక్కడక్కడ 40 నుండి 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది

రేపు  రాయలసీమలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. 

తిరుమలలో జోరు వాన
తిరుమలలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుండి అగ్గిని కురిపించిన భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. తిరుమలలో ఉన్నపళంగా అకాశం మబ్బులు కమ్ముకొని జోరున వాన కురవడంతో భానుడు శాంతించాడు. దీనికి తోడు హోరున గాలులు కూడా తోడవడంతో తిరుమల మొత్తం ఒక్కసారిగా చల్లటి వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments